Latest News

Telangana Poems


నవ తెలంగాణ గేయం -- సిద్దార్థ పాములపర్తి

బిగిసిన ఓ పిడికిలయ్యి
ఎగసిన ఓ ఉప్పెన్నయ్యి
అభ్యుదయం పల్లవించే 
గేయమయ్యే తెలంగాణ ||2||

ఊరు ఊరు వాడ వాడ
ఇంటి ఇంటి గడప కాడ
నినాదాల స్వరాలతో
గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||

గుండె పగిలి కడుపు కాలి
నెత్తుటి కన్నీళ్లు రాలి
సముద్రమై పొంగుతున్న
గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||

అరిచి అరిచి ఏండ్లు గడ్చి
హక్కులకై కలిసి వచ్చి
గొంతులన్ని పాడుకునే
గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||

శ్రమజీవుల పనిముట్లై
నవయువకుల పిడికిల్లై
పల్లెటూర్ల పంటలయ్యి
రైతుకడుపు మంటలయ్యి
మైసమ్మ గుడి గంటలయ్యి
పసి పిల్లల్ల జోలలయ్యి
ఆదివాసుల రేలలయ్యి 
దేశమంతా మారుమోగే

గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||

- సిద్దార్థ పాములపర్తి

Posted Date:19-03-2014
comments powered by Disqus