Latest News

Telangana Poems


ఐక్యత లేని సమైక్యత సతీష్ కుమార్.బొట్ల

ఐక్యత లేని సమైక్యత 

సఖ్యత లేని సమైక్యత 
ఐక్యత లేని అధిక్యత 
సమైక్య ఆంధ్ర సిద్ధాంతం 
సిద్ధాంతం కదాది పనికిమాలిన రాద్ధాంతం   
జాతీయ జెండాను పట్టుకని జాతీయ వాదమన్న 
స్వలాబం కోసం సమైక్య వాదమన్న  
అది తుపాకీ  లేని తుట 
నీతిలేని మాట  
జాతీయ జెండా బుజాన వేసుకున్నoత మాత్రాన 
ప్రతివాడు గాంధీ కాలేడు
కృత్రిమ  అల్లర్లు సృష్టించినంత   మాత్రాన 
సమైక్య ఆంధ్ర ఒక్క ఉద్యమం కాలేదు 

తెలంగాణ వాళ్ళు జాగో- బాగో అన్న 
తెగేసి జన్మలో కలిసుండేది లేదన్న 
తెగించి చికోట్టిన చిత్కరించించున్న
ఎన్నేళ్ళు , ఇంకా ఎన్నాళ్ళు 
మీ రాజకీయ , దన, లాబం కోసం 
సీమాంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతారు 
ఐన 
ఆత్మ గౌరవం లేని నాయకుల 
ఆత్మ గౌరవవిలువ తెలియని ప్రజలు ఉన్నంత కాలం         
సమైక్యతనే వల్లిస్తారు 
సమైక్య అంద్రనే వల్లవేస్తారు   

ఐన 
ఐక్యత లేని సమైక్యత ఎందుకు ?
ఫజాల్ అలీ కామిషన్ వ్యతిరేకించినా
1969  పోరాటమై గర్జించిన 
ముల్కీ నిబందనల అమలుకి హైకోర్ట్ మోట్టికాయలేసిన
తెగతెంపులు జరగాలని తెలంగాణ సమితి తెగేసి చెప్పిన 
2009 కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన 
తెలివిలేని శ్రీకృష్ణ కమిటి కూడా 
తెలంగాణ తప్ప ప్రజలు దేన్నీ కంక్షిచారు అని చెప్పిన 
సకలం తెలంగాణ మై 
సకల జనుల యుద్ధ మై
సమస్త  తెలంగానం  అంత  
సమరం  జరుపుతున్న   
ఇంకా సిగ్గు లేకుండా 
సమైక్యతనే ఎందుకు నినదిస్తారు 

మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రము కోసం మీరు 
ఉద్యమించినప్పుడు ఏమైంది మీ సమైక్యత ?
ముల్కీ నిబందనలకు వ్యతిరేకంగా మీరు 
జై ఆంధ్ర కు జై కొట్టినప్పుడు ఏమైంది మీ సమైక్యత ?
జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న నేటితారునంలో
ఏమైంది మీ ఆంధ్ర ప్రజలు , నాయకులలోని  సమైక్యత ?   
మీ సౌక్యం కోసం మీకు మాతో సమైక్యత కావాలి 
కాని మా సౌక్యం కోసం మాకు మీతో అనైక్యత కావాలి 
మీరు కలసి ఉండలనటం తప్పుకాద ?
మేము విదిపోవలనటం తప్పు !

ఐన 
విడిపోవటం అంటే చెడిపోవటం కాదని 
తెలుసుకోలేని తెలివి తక్కువ నాయకులూ 
విబజన అంటే మట్టి విబజననే కాని మనుషుల విబజన కాదని
 అర్ధం చేసుకోల్ని అయోమయపు  ప్రజలు ఉన్నంత కాలం       
 సమైక్యతనే వల్లిస్తారు
 సమైక్య అంద్రనే నినదిస్తారు 

ఏది ఎమైన
అప్పుడు , ఇప్పుడు , ఎప్పుడు 
చరిత్ర 
చెప్పిన , చెప్పుతున్న చెప్పబోతున్న 
నిజం  ఒక్కటే అది 
 ఐక్యత లేని అధిక్యత 
సఖ్యత లేని సమైక్యత 
శాశ్వతం కాదని కాలేదని.

సమైక్య ఆంద్ర డౌన్ డౌన్!        జై జై తెలంగాణ !!

                             రచన 
                  సతీష్ కుమార్ . బొట్ల (తెలంగాణ సతీష్)
                   బొట్లవనపర్తి 
                    కరీంనగర్ 
                9985960614
                botla1987.mygoal@Gmail.com 

Posted Date:19-03-2014
comments powered by Disqus