Latest News

Telangana Poems


సకల జనుల ఉద్యమ కవాతు -- సుజాత సూరేపల్లి

 

సకల జనుల ఉద్యమ కవాతు 

తెలంగాణా మట్టి పోత్తిల్లలోంచి
ఏరులై పారుతున్న జనం 
జై తెలంగాణా నినాదం
దమనుల సిరలల్లోంచి ఉప్పొంగుతున్న స్వేచ్చావాదం 

పోద్దుతిరగని పూల బతుకమ్మల 
లోగిల్లల్ల గాయిగాయి అయి 
గత్తరోచ్చి అడ్డంబడ్డ 
వలస భూస్వాములు 

బొగ్గుబాయిలల్ల నిప్పులై కురుస్తున్న 
అగ్గి పిడుగుల ముందు 
మాడి మసి అయితున్న 
మస్టర్ల నజరానాలు 

తెలంగాణ ఉద్యమ పాఠ్య  పుస్తకాలతొటి 
రొడ్డుకెక్కిన ఉపాధ్యాయులు
బందగీ, కొమరంభీములు 
అయిన విద్యార్థులు 

అంధ్రా అనె అంటువ్యాది మనల్ని 
 మింగెయక ముందె 
శస్త్ర  చికిత్స చెసి 
వేరు  చెయమని రాలీలు 
చెస్తున్న డాక్టలు 

ఆర్టీసు అన్నల నగారాల ముందు 
దివాన్లైన దివాకర్ల బేజార్లు 
చతికిల బడ్డ దగాకోర్లు  

అయిలవ్వ అడుగులల్ల నడిచిన ముద్దుబిడ్డ 
విమలక్క పంజా కింద 
ఉక్కిరిబిక్కిరి అయితున్న 
అపర గాంధిల లాంకొలు 

పఠమెసి  తెలంగాణ ముగ్గుబొసిన 
రైతన్నల శాపాల ముందు 
గిర గిర తిరిగి పడుతున్న పెట్టుబడులు   

పవిత్ర శుక్రవారాల నామాజులల్ల
తెలంగాణా ఆజాది కొరకు ముస్లింల మొక్కులు 
క్రైస్తవ ప్రార్ధనలలో అమరవీరుల 
ఆత్మల కు శాంతి ప్రవచనాలు 

కార్మికకర్షక 
ఉద్యొగొపాద్యాయా 
విధ్యార్థి లొకం 
పొరుకేకల మధ్య 
ఢిల్లికి పారిపొయిన 
కుళ్ళు రాజకీయం 

 

గాలి నీరు 
నింగి నేల ఒక్కటై
జీవితాన్ని  ముంచెత్తుతున్న  
జై తెలంగానం 

సకల జనుల సమ్మె 
డిల్లి దర్బారుకు 
సంధించిన విప్లవ బాణం 
నయావంచక పాలకులకు 
తెలంగాణ తప్ప లెదు మార్గం  

సుజాత సూరేపల్లి 

Posted Date:19-03-2014
comments powered by Disqus