నమ్మిన నా రాజే నరహంతకుడా..?
ఏమో అనిపిస్తుంది...
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే
మొన్న... సహాయ నిరాకరణ
అధిపతుల పీటం కడులుతుందన్న
సందర్బంలో... అకస్మాత్తుగా అప్పెయ్యమనడం
నిన్న... సకల జనుల సమ్మె
ఆదిపత్యాలకు చెమటలు పడ్తున్న సమయాన
సమ్మెలో సడలికలు
ఇయ్యాల... పోలవరం
పోటెత్తే మాటల కోటలుగట్టి
నమ్మ బలికిన నమస్తే తెలంగాణ లో
అనుచరుడికే దక్కిందని అభినందన కేరింతలు
పోటు మీద పోటు
పోటు మీద పోటు...
నమ్మిన నా రాజే రాజకీయం చేస్తున్నాడా...
నమ్మించి నా తమ్ముల ప్రాణాలు తీస్తున్నాడా...
ఏమో... నా ఇంగిత జ్ఞానానికి ఇంతకంటే ఎక్కువ తడ్తలేదు
|