తెలంగాణ రాష్ట్ర సామాజిక-సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ... నేటి తరానికి ఈ ప్రాంత పూర్తి సమాచారం అందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు మరియు కార్యక్రమాల గురించి అందించాలనేది మా చిన్ని ప్రయత్నం. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక, సామాజిక అంశాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ...పూర్వీకుల నుంచి నేటి తరం మహానుభావులు, రాజకీయ నాయకులు, మేటి వ్యక్తుల జీవిత చరిత్రలు, వారి అనుభవాలు, వారు రాసిన గ్రంథాలను ఆడియో మరియు వీడియోల ద్వారా తెలియపరచడానికి ముందుంటాం. తెలంగాణలో ఉన్నటువంటి సహజవనరులు, మేథో సంపత్తి , నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశంలో ముందుండటానికి అవకాశం ఉంది. కానీ ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడలేదు. ముందు పడలేదు. నేడు తెలంగాణ ప్రజలను, మా పాఠకులను ఉత్తేజ పరుస్తూ ఈ తెలంగాణ బృందం తమకున్న అన్ని విధాల సహజ వనరులను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షంగా ఉండేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తాం. మీ ఆశయాలు నెరవేరటానికి మేము సహకరిస్తాం.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సంపన్నంగా చూడటమే మా ముఖ్య లక్ష్యం. అందుకు తగినట్టుగా రాష్ట్ర ప్రజలు సహజవనరులు ఉపయోగించుకుని గొప్ప స్థితికి చేరుకునేలా ఉండేందుకు సర్వదా కృషి చేస్తాం.
www.etelangana.org అనేది ఎలాంటి పక్షపాత ధోరణి అవలంభించకుండా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ సమాచారం అందిస్తూ ప్రజా చైతన్యానికి సహకరిస్తాం.