అనంతపురంలో ఉద్రిక్తత వాతావరణం.. వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

అనంతపురంలోని క్లాక్ టవర్ దగ్గర వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు హరికృష్ణ టీడీపీ నేతలకు సవాలు విసురుతూ క్లాక్‌ టవర్‌ వద్దకు చేరుకోగా

వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పరిటాల సునీత మధ్య వివాదంతో ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి . అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కాగా, సోషల్ మీడియా పోస్ట్ వివాదంతో అనంతపురంలోని క్లాక్ టవర్ దగ్గర వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు హరికృష్ణ టీడీపీ నేతలకు సవాలు విసురుతూ క్లాక్‌ టవర్‌ వద్దకు చేరుకోగా, వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య  దాడి జరగడంతో పలువురు నేతలు గాయపడ్డారు. అయితే పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై టీడీపీ మద్దతుదారులు సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతపురం క్లాక్ టవర్ సెంటర్‌కు రావాలని ఇరు వర్గాల మద్దతుదారులు ఒకరినొకరు సవాలు చేసుకున్నారు.

Previous article