జూన్ లోనే పేపర్ లీకేజి కు కుట్ర వారి టార్గెట్ ప్రధానంగా గ్రూప్ 1
టీఎస్‌పీఎస్సీపేపర్ లీకేజి వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు . ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్ ,రాజశేఖర్ రెడ్డి నుంచి సమాచారం రాబడుతున్నారు
హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీపేపర్ లీకేజి వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు . ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్ ,రాజశేఖర్ రెడ్డి నుంచి సమాచారం రాబడుతున్నారు . వీరు పేపర్ కోసం జూన్ ఉంచే ప్రయత్నాలు చేశారని విచారణలో తేలింది .పేపర్ లీకేజిలో మూడవరోజు సిట్ అధికారులు విచారణ జరిపారు . ప్రధాన నిందితులను ప్రశ్నించారు.టీఎస్‌పీఎస్సీ కి నిందితులను మరో సారి తీసుకవచ్చి ప్రత్యేకంగా విచారించారు . పేపర్ కస్టడీయన్ శంకర్ లక్మి తన డైరీలో ఉన్న పాస్ వర్డ్ రాసుకున్న దానిని అపహరించామని ముందుగా నిందితులు చెప్పారు.శంకరలక్ష్మి వాంగ్మూలం లో ఎక్కడ పాస్ వర్డ్ తన డైరీలో రాసి పెట్టలేదని వెల్లడించడంతో పోలీసులు ఈ విషయం పై స్పష్టత కోసం నిందితుడు రాజశేఖర్ ను ప్రత్యేకంగా విచారించారు . సిస్టం ఐపీ లు రాజశేఖర్ వద్ద ఉండడంతో శంకర లక్ష్మి కంప్యూటర్ ను ఓపెన్ చేసినట్లు వెల్లడించారు . సిస్టం లో రహస్యంగా ఉన్న ఫోల్డర్లకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకోక పోవడంతో ,సిస్టం అడ్మిన్ రాజా శేఖర్ కు అన్ని అంశాల పైఅవగాహనా ఉండడంతో సులభంగా ఓపెన్ చేసినట్లు విచారణలో తేలింది . రాజశేఖర్ రెడ్డి జూన్ నుంచే గ్రూప్ 1 ప్రశ్న పత్రం కోసం చూశారు .మూడు ధపాలుగా ప్రయత్నించారు .అప్పటికి ప్రశ్న పత్రం రాకపోవడం తో అక్టోబర్ మొదటి వారంలో పెన్ డ్రైవ్ లో కాఫీ చేసినట్లు వెల్లడించారు .