దెబ్బతిన్న పంటలను పరిశీలించండి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్‌ సూచన

రైతన్నలకు అకాలవర్షాలు దెబ్బ తీశాయి . పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది . ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలనిమంత్రి తారక రామ రావు ఆదేశించారు

హైదరాబాద్: రైతన్నలకు అకాలవర్షాలు దెబ్బ తీశాయి . పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది . ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలనిమంత్రి  తారక రామ రావు ఆదేశించారు . నష్టం వాటిల్లిన పంటలను , వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు  పిలుపునిచ్చారు . రైతులకు భరోసా నిచ్చేలా , వారికీ ఆత్మవిశ్వాసం నింపేలా ధైర్యం చెప్పాలని కోరారు . ఆత్మీయ సమ్మేళనాలు , ఇతర సమావేశాలు చేస్తున్న ఎమ్మెల్యే  లతో , ఇంఛార్జులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు . ఐ సందర్బంగా ఆయన  మాట్లాడారు ..  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు పంచాయతీరాజ్‌ రోడ్ల పనులను వర్షాకాలం వచ్చేలోగా పూర్తి చేయించుకోవాలని కోరారు . గ్రామస్థాయిలో ఉపాధిహామీ, పంచాయతీరాజ్‌, పట్టణప్రగతి, పల్లెప్రగతి తదితర కార్యక్రమాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉండాలన్నారు.

Previous article