అడవులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మానవ మనుగడకు అడవుల పాత్ర ఎంతో ముఖ్యమైనది . అటవీ , పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు . ఆర్థిక , సామాజిక , సాంస్కృతిక , పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతగానో అవసరమని అన్నారు .
నిర్మల్:మానవ మనుగడకు అడవుల పాత్ర ఎంతో ముఖ్యమైనది . అటవీ , పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు .
ఆర్థిక , సామాజిక , సాంస్కృతిక , పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతగానో అవసరమని అన్నారు . ప్రపంచ అటవీ దినోత్సవ ని నేపథ్యం లో నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమం లో పాల్గొన్నారు . అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు . ర్యాలీ అనంతరం ఆయన గండి రామన్న హరితవనం లో మంత్రి మొక్కలు నాటారు . భవిష్యత్ తారలను దృష్టి లో ఉంచుకొని ముఖ్యమంత్రి హరిత హరిత హారం కార్యక్రమం చేపట్టారు అన్నారు .2015 నుంచి 2021 మధ్య కాలంలో పచ్చదనం 7.70 శాతం పెరిగిందన్నారు . ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యం లో వన్య మృగాలా సంఖ్య పెరిగిందన్నారు . కవ్వాల్ , అమ్రాబాద్ టైగర్ రిజర్వు లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగాయన్నారు. అడవులని రక్షించు కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు .అడవులను నరికి వేస్తే భవిష్యత్తులో దుష్పరిణామాలు వస్తాయని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు .