ఆసీస్ తో మూడో వన్డే లో టీం ఇండియా ఓటమి

ఆసీస్ మూడు వన్డే ల సిరీస్ లో భాగంగా భారత్ తో తలపడింది . మొదటి మ్యాచ్ ఇండియా గెలిచిన తరువాత రెండవ , మూడవ మ్యాచ్ లో ఇండియా ఓటమి పాలైంది . దీంతో ఆసీస్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది .

చెన్నై : ఆసీస్ మూడు వన్డే ల సిరీస్ లో భాగంగా భారత్ తో తలపడింది . మొదటి మ్యాచ్ ఇండియా గెలిచిన తరువాత రెండవ , మూడవ మ్యాచ్ లో  ఇండియా ఓటమి పాలైంది .  దీంతో ఆసీస్ 2-1  తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది . బుధవారం జరిగిన చివరి మ్యాచ్ లో తోయం ఇండియా చేజేతులా ఓటమి పాలైంది . మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా 269 పరుగులు చేసింది . లక్ష్య ఛేదనలో ఇండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది . మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులకు  ఆల్ అవుట్ అయ్యింది. 


మిచెల్ మార్ష్47 బంతుల్లో  47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు . భారత బౌలింగ్ లో హార్దిక్ పాండ్య 3/44 తో ఆకట్టుకున్నాడు . స్పిన్ తో కూల్ దీప్ 3/56 తో ఆస్టేలియాను దెబ్బ కొట్టాడు .  మహమ్మద్ సిరాజ్ 2/37 , అక్షర్ పటేల్ 2/57 తో రాణించారు . తరువాత బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది . బ్యాటింగ్ కు దిగిన చేతులారా వికెట్లు పారేసుకున్నారు . దీంతో ఓటమి లాంఛనంఅయ్యింది. ఓపెనర్లు రోహిత్ 30 , గిల్ 37 పరుగులు చేశారు .9 ఓవర్ల వరకు భారత్  స్కోరు 65/0 ఉన్నది . లక్ష్య ఛేదన సాఫీగా సాగుతున్నది  తరుణం లో. స్వల్ప  వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు . చివరికి విజయానికి 5 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉన్నది . 46వ ఓవర్లలో జడేజా అవుట్ అవ్వడం తో భారత ఓటమి లాంఛనం అ య్యింది . 

Previous article