కిడ్నీలో రాళ్ల సమస్యనుంచి బయట పడాలంటే . ఈ జాగ్రత్తలు తప్పని సరి పాటించాలి
కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చిందంటే అది తీవ్రంగా వేధిస్తుంది . ఈ సమస్య ఎండాకాలం లో ఎక్కువగా వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు . ఎండా కాలం లో ఎండలు ఎక్కువగా కోట్టడం , దంతో ఉష్ణోగ్రతలు పెరగడం ,
ఆరోగ్యం : కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చిందంటే అది తీవ్రంగా వేధిస్తుంది . ఈ సమస్య ఎండాకాలం లో ఎక్కువగా వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు . ఎండా కాలం లో ఎండలు ఎక్కువగా కోట్టడం , దంతో ఉష్ణోగ్రతలు పెరగడం , వాతావరణం లోని తేమ కిడ్నీలకు చేటు చేస్తాయి . కావున ఎండాకాలం లో శరీరాన్ని సూర్యుడి నుంచి కాపాడుకోవాలి. శరీరం లోని నీరు చెమట రూపంలో అధికంగా బయటకు పోతుంది . ఇలా కావడం వాళ్ళ డి హైడ్రేషన్ ముప్పు పొంచి ఉంది .ఈ సమస్యనుంచి బయట పడక పోతే కిడ్నీలకు ముప్పు పొంచి ఉంది . ఇప్పటికే మూత్ర పిండ వ్యాధి సమస్య ఉన్నవారు జాగ్రత్త పడాలి .
ఎండకాలం చెమట కారణంగా శరీరం ఎక్కువ మొత్తంలో నీళ్లను కోల్పోతుంది. అలా డీహైడ్రేషన్‌కు ఆస్కారం ఎక్కువ. కిడ్నీలో రాళ్లకు డీహైడ్రేషన్ కూడా ఓ కారణం. ఎండకాలంలో మాంసాహారం లాంటి ప్రొటీన్లు ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాళ్లలో కూడా కిడ్నీల్లో రాళ్లకు అవకాశం ఉంటుంది. కాబట్టి, మాంసాహారులు తగిన మోతాదులో నీళ్లు తాగాలి. ఇక ఫాస్ట్‌ఫుడ్స్‌లో ఉప్పు, ప్రొటీన్లు, చక్కెరలు ఎక్కువ. ఇవి రాళ్ల ముప్పు పెంచుతాయి. అందువల్ల కిడ్నీల ఆరోగ్యానికి హామీ ఇచ్చే ఆహార పదార్థాల మీదే దృష్టిపెట్టాలి. పెద్దలు రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. బయటికి వెళ్తున్నప్పుడు నీళ్ల బాటిల్ వెంట తీసుకువెళ్లాలి. మూత్రాన్ని ఉగ్గబట్టుకోకూడదు. దీనివల్ల మూత్రం సాంద్రత ఎక్కువై రాళ్లు వృద్ధి చెందుతాయి.