రాహుల్ సిప్లిగంజ్‌ను సన్మానించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అవార్డును తీసుకున్న సందర్బంగా హైదరాబాద్ చేసుకున్న సిప్లిగంజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు . ఆస్కార్ అవార్డుతో తెలుగు వారి సత్తా చాటారని కొనియాడారు .

హైదరాబాద్ :ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) చిత్రంలోని నాటు నాటు పాటతో ఆస్కార్‌ అవార్డ్‌(Oscar Award) వచ్చిన విషయం తెలిసిందే . ఇందులో రాహుల్ సిప్లిగంజ్ భాగస్వామ్యం ఉన్నదీ . అవార్డును తీసుకున్న సందర్బంగా హైదరాబాద్ చేసుకున్న సిప్లిగంజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు . ఆస్కార్ అవార్డుతో తెలుగు వారి సత్తా చాటారని కొనియాడారు . సిప్లిగంజ్ ను శాలువాతో సన్మానించారు . అభినందనలు తెలిపారు . ఆస్కార్ అవార్డు పొందిన మొదటి తెలుగు చిత్రం అని  మంత్రి సంతోషం వ్యక్తం చేశారు .భవిష్యత్‌లోనూ మరింత తన గాత్రంతో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
95 వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు నాటు పాట రాసిన చంద్రబోస్‌, సంగీతమందించిన కీరవాణికి ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రదానంలోనూ రాహుల్‌ సిప్లిగంజ్‌ పాల్గొని పాటను వినిపించారు.

 

Previous article