టీడీపీ మినీ మేనిఫెస్టోపై స్పందించిన గంటా శ్రీనివాస్
తెలుగుదేశం పార్టీ మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టో చూసి వైఎస్సార్‌సీపీ నేతలు భయపడుతున్నారని
విశాఖ: తెలుగుదేశం పార్టీ మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టో చూసి వైఎస్సార్‌సీపీ నేతలు భయపడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మహానాడు 2023, టీడీపీ ఆరు హామీలపై గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టో కేవలం ట్రైలర్ మాత్రమేనని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని, దీనికి ప్రజల నుంచి కచ్చితంగా ఆదరణ లభిస్తుందని గంటా శ్రీనివాసరావు వివరించారు. రాజమండ్రిలో మహానాడు 2023 విజయవంతమైందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏపీలో విధ్వంసం, అరాచక పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కూడా జగన్ మోహన్ రెడ్డి సాధించలేదని విమర్శించారు.