గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లలో బిజీబిజీగా అధికారులు

ఎట్టలకేలకు తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది.

హైదరాబాద్ : ఎట్టలకేలకు తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయంతో పరీక్షా నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలె. చాలా కాలంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం దాదాపు 3 లక్షల 60వేలకుపైగా అభ్యర్థులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలతో అభ్యర్థుల్లో నమ్మకం ఏర్పడింది. 
హైకోర్టు నిర్ణయంతో జూన్ 11వ తేదీ (ఆదివారం)న గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మొత్తం 3 లక్షల 63 వేల మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. 503 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అంతకుముందు ఏం జరిగిందంటే..?
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ జూన్ 11న జరగనుంది. 2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 63 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. పేపర్‌ లీకేజీ కారణంతో ఈ పరీక్షను రద్దు చేసి, జూన్11న నిర్వహించనున్నారు.

 

Previous article