ఒంగోలులో దారుణం.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన వెంకటేశ్వర్లు
ప్రకాశం: తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు.. నగరంలోని కోర్టు సెంటర్ సమీపంలో ఆంధ్రా బ్యాంకు వద్ద కాపలాగా ఉన్న అతను ఈ రోజు మధ్యాహ్నం తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతనిని గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ ను చీమకుర్తికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.