సిబ్బందికి పని ఒత్తిడి కారణంగానే రైలు ప్రమాదాలు: వినోద్‌ కుమార్‌

రైల్వే శాఖలో 3.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లేఖ

హైదరాబాద్‌: సిబ్బందికి పని ఒత్తిడి కారణంగానే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. దక్షిణ మధ్య రైల్వేలోనే 30వేల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఉద్యోగ ఖాళీల వల్ల సిబ్బందికి పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. పర్యవేక్షణ లోపం ప్రమాదాలకు దారి తీస్తోందని వినోద్‌ కుమార్‌ లేఖ ద్వారా మంత్రికి వివరించారు.

Previous article