లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
కొనుగోళ్ల జోరుతో నేడు స్టాక్ మార్కెట్ లాభాల జోరు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. కొనుగోళ్ల జోరుతో నేడు స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగాయి. మదుపరులు వివిధ రంగాల షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు పరుగులు తీశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 240.36 పాయింట్ల వృద్ధితో 62,787.47 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 59.70 పాయింట్ల వృద్ధితో 18,593.80 వద్ద ముగిసింది.