అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా..ఈ నెల 11వ తేదీన విశాఖకు.!

బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు రాలేకపోతున్నట్లు తెలిపిన అమిత్ షా

విశాఖపట్నం: కేంద్ర హోం శాఖ మంత్రి ఈనెలలో విశాఖ పట్నంలో పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నెల 8వ తేదీన విశాఖకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు రాలేకపోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ఆయన సమాచారం అందించారు. అయితే ఈ నెల 11వ తేదీన విశాఖకు వస్తున్నట్లు చెప్పారు. అమిత్ షా భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు

Previous article