జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం

జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

 హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులు  బీభత్సం సృష్టించాయి. కోరుట్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది . అకస్మాత్తుగా భారీ గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈదురు గాలులు, వర్షానికి కోరుట్ల -మెట్ పల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో పలు వాహనదారుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వేరే దారి లేక ఆ పక్క నుంచే వాహనాలు వెళ్తుండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామంలోనూ అకాల వర్షం ఆందోళనలకు గురి చేసింది. ఈదురు గాలులకు రైతు వేదిక పై కప్పు కూడా లేచిపోయి.. కొంత దూరంలో ఎగిరిపడింది.

 

Previous article