Latest News

Sudheer


తెలంగాణ రాష్ట్రం రాదేమోనన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఇర్సవడ్ల సుధీర్ (18) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం పత్తిచేనులోకి వెళ్ళాడు. చేనులో వున్న పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలోకి వెళ్ళాడు.

చుట్టుపక్కల రైతులు గ్రహించి 108 వాహ నానికి సమాచారం అందించడంతో హుటాహుటిన సుధీర్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా, మార్గమధ్యలోనే సుధీర్ మృతి చెందాడు. మృతుడి చొక్కా జేబులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం తన ప్రాణాలను ఆర్పిస్తున్నట్లు సుసైడ్ నోట్‌లో రాసి ఉంది. తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు పోలీసులు తరలించారు. కాగా, సు«ధీర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ములుగు నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ చాప బాబుదొర డిమాండ్ చేశారు.

Posted Date:29-04-2014
comments powered by Disqus