ఖమ్మం :

చరిత్ర :

ఖమ్మం యొక్క నామం పట్టణంలో ఒక కొండ మీద నిర్మించిన ‘నరసింహద్రి’ ఆలయం నుండి ఉద్భవించిందని చెపుతారు. ఈ ఆలయాన్ని ‘స్తంబా సిఖరి’ మరియు తరువాత ‘స్తంభాద్రి’ అని పిలుస్తారు. నరసింహ స్వామి ఒక రాతి స్తంభము నుండి ఉద్భవించి తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడటానికి దుష్ట రాజు హిరణ్య కశ్యపుని చంపారని నమ్ముతారు. ఈ సంఘటన కృత యుగంలో జరిగినట్లు చెప్పబడింది. ఈ ఆలయం క్రింద ఉన్న నిలువు రాగిని ‘కంబా’ అని పిలుస్తారు మరియు కొండ అడుగుభాగంలో ఉన్న పట్టణాన్ని కంబమెట్ట అని పిలిచేవారు. ఇదిఛివరికి ఖమ్మం గా మారింది.

పర్యాటకం

వైరా చెరువు
వైరా చెరువు క్రిష్ణా నది ఉపనది అయిన వైరా నది పై మధ్య తరహ సాగునీటి ప్రాజెక్టుగా నిర్మించబడినది. ఈ రిజర్వాయర్ తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో కలదు. అది ఖమ్మం జిల్లాలో ముఖ్య పర్యాటక ప్రదేశంగా కలదు. వైరా రిజర్వాయర్ 1930 లో కట్టబడి తర్వాత భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చే ప్రారంబింపబడినది. ఈ చెరువు వైరా పక్కల 8 మండలాలకు తాగునీటిని అందించుచూ 17,391 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది. ఈ చెరువు చేపలు పట్టుటకు కూడా ప్రసిద్దము. ఈ చెరువుకు నాగార్జున సాగర్ నుండి నీరు అందును. పాలేరు చెరువు
పాలేరు చెరువు మానవ నిర్మితమై తెలంగాణలోని ఖమ్మం జిల్లా నందు మంచి నీటి వనరుగా యున్నది. అది కూసుమంచి మండలంలో పాలేరు గ్రమం నందు ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణంకు 30 కి.మి దూరంలో కలదు. ఈ చెరువు నాగార్జున సాగర్ లాల్ బహదూర్ ఎడమ కాలువ పై బ్యాలన్సింగ్ రిజర్వాయర్గా ఉంటూ 1748 హెక్టార్లలో 2.5 టిఎంసి నిల్వ సామర్ద్యం కలిగిఉన్నది. ఈ చెరువు జిల్లలో ఒక ముఖ్య పర్యాటక ప్రదేశంగా ఉన్నది. ఈ రిజర్వాయర్ పై విద్యుత్తు కూడా తయారు చేయబడును.
లకారం చెరువు
లకారం చెరువు ఖమ్మం పట్టణంలోని చెరువుల్లో ఒకటి. ఖమ్మం బస్ స్టేషన్ కు 4 కి.మి దూరంలోని ఈ చెరువు పట్టణంలోని ప్రముఖ పర్యాటక స్థలం. 15 సంవత్సరాల క్రితం పిచ్చి చెట్లతో ఉన్న ఈ చెరువుకు ఇప్పుడు లకారం లేక్ వ్యూ పేరుతొ ఒక పార్క్ మరియు సమీపంలో పర్యాటకుల కోసం ప్రత్యెక బోటు సదుపాయం కలదు.
ఆర్కియాలజీ & మ్యూజియములు
ఖమ్మం జిల్లాలో 1984లో నేలకొండపల్లి వద్ద బౌద్ధ స్థూపం ఇతర పురాతన వస్తువులు బయట పడ్డాయి. ప్రస్తుతం ఇచట మ్యుజియం లేనందువలన రాష్ట్ర మ్యూజియంలో భద్రపరిచారు.
సోర్స్ : తెలంగాణ స్టేట్ పోర్టల్