సంగారెడ్డ :

చరిత్ర :

పూర్వం అందోల్ రాజ్యాని 24 పరగణాలుగా విభజింఛి పరిపాలించిన రాయబాగిన్ మహా రాణి శంకరమ్మ 1702 వ సంవత్సరo లో సంగారెడ్డి పట్టణానికి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న గౌడిచర్ల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లి పేరు రాజమ్మ, తండ్రి పేరు సంగారెడ్డి. భర్త పేరు వెంకట నరసింహారెడ్డి. తన భర్త శత్రువుల చేతిలో హత్య చేయబడ్డ తర్వాత భర్త ఆశయాలను నిలుపడానికి, అత్తమామల ఆజ్ఞతో అందోల్ రాజ్యాని పరిపాలించింది. శంకరమ్మ తండ్రి పేరున వెలిసిన ప్రస్తుత పట్టణమే సంగారెడ్డి. వారి తల్లి పేరున ఉన్న గ్రామం రాజంపేట. ఆమె పెంపుడు కొడుకైన సదాశివరెడ్డి పేరున ఉన్న నేటి పట్టణం సదాశివపేట. సంగారెడ్డి పట్టణం పూర్వం మెదక్ జిల్లా కేంద్రంగా ఉండేది. తేది 11-10-2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఉత్తరువుల ప్రకారం మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి.
1. సంగారెడ్డి జిల్లా 2. మెదక్ జిల్లా ౩.సిద్ధిపేట జిల్లా.

పర్యాటకం


మంజీర జలాశయం
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నగరం నుండి 7 కి. మీ దూరంలో మంజీర జలాశయము ఉన్నది. పురావస్తు ప్రదర్శనశాల కొండాపూర్
శాతవాహన చక్రవర్తుల చే నిర్మింపబడి చుట్టూ కోతలతో ఆవరింపబడిన మహానగరమే కొండాపూర్. ఈ ప్రాంతాన్ని గుతమి పుత్ర శతకర్నుడు పాలించినట్లు తెలుస్తుంది. 1940-42 సం. రాలలో హైదరాబాద్ పురాతత్వ శక వారు కొండాపూర్, తెర్పోలె గ్రామాల మధ్య గలఒక మట్టి దిబ్బను త్రవారు. ఇందులో బౌద్ధస్తూప, విహార, చైత మండపములు మరియు నేలమాళిగల శిథిలావశేములు వెలుగు చూసినవి. ఇంకా క్రీస్తు శక రంభ శతాబ్దంలకు చెందినాశిల్ప ఖండాలు, నాణెములు, పూసలు, మట్టి బొమ్మలు, వివిదక్ర్తులు, మట్టి పాత్రలు బయటపడ్డాయి.
సింగూర్ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ మంజీరా నది ఫై సింగూర్ గ్రామం వద్ద నిర్మింపబడింది. అందుకే దీన్ని సింగూర్ ప్రాజెక్ట్ అని పేరు వచ్చింది. ఇది సంగారెడ్డి నుండి 36 కి.మీ. దూరం లో ఉంది. ఈ ప్రాజెక్ట్ 1988 లో నిర్మింపబడింది. ఈ ప్రాజెక్ట్ యొక్క నీటిసామర్థ్యం 29 టి.ఎం.సి.లు. ఇది ప్రదానంగా త్రాగు నీటి కోసమే నిర్మింపబడింది. దీని ద్వారా హైదరాబాద్ పట్టణ ప్రజలకు త్రాగు నీరు అందుతుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా జల విద్యుత్ ఉత్పతి అవుతుంది. ఇందులో అనేకమైన మొసళ్ళు, జీవరాసులు ఉన్నాయ్.
మంజీరా వన్యప్రాణి అభయారణ్యం
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నగరం నుండి 5 కి. మీ దూరంలో మంజీర సింగూర్ బ్యారేజీల మధ్య రెండు వేల హెక్టార్లలో మంజీరా వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఈ అరణ్యం 36 కి. మీ. పొడవు 500 నుంచి 800 మీటర్ల వరకు వెడల్పు కలిగి ఉంది. ఇందులో 9 ద్వీపాలు ఉన్నాయ్. వీటిలో పుట్టగడ్డ, బాపనిగడ్డ, కరణం గడ్డ, సంగం గడ్డ అనే ద్వీపాలు ప్రతేక్యమైనవి.
సోర్స్ : తెలంగాణ స్టేట్ పోర్టల్