Latest News

Telangana Poems


పుడమి తల్లి గర్భకోత" అందె శ్రీధర్

పుడమి తల్లి గర్భకోత
 
గనులు పేర్చుకున్న మాత
వనము ఒంటి పచ్చ పూత
జలము ఉమ్మ నీటి పోత
ఫలములిచ్చు ప్రాణదాత
జవము దాచుకున్న గనత
(జవము = జీవము లాలించు జగతి
హరితము సృష్టించు పతిత
అనన్య అధ్బుత జాత
లవణములు పంచు దేవత

మనిషి శరీరంలో ఏ అవయవము ఎక్కడ ఉండాలొ అక్కడ ఉన్నాయి,,,, మనిషి గర్భంలో ఏవి దాచాలో అవి దాచ బడి ఉంచబడినవి.... అదే విధంగా మనిషిలోని ప్రతీ అవయవ భాద్యతలు అవి నిర్వహించుచున్నాయి.....మనిషి శరీర తత్వం body metabolism.. శరీరంలో ఎంత నీరు, ఎంత ప్రోటీన్లు, ఎంత కార్బో హైడ్రేట్స్, ఎంత మినరల్స్ ఉండాలో అంత ఉంటేనే మనిషీ ఆరోగ్యం ..... మనిషి ప్రేవులు లోపల వున్నాయి... అవి ఎలా పనిచేస్తున్నాయో..అని అనుమానంతో.. బయటకు తీసి అమర్చుకొని .. గుండెను బయట అమర్చుకొని ...ప్రతీ అవయవము బయట మనకు కనబడే విధంగా అమర్చుకొని వాటి చర్యలను ఉపయుక్తంగా క్రమబద్దీకరించుకుందాం.. అనుకోవడం ఎంతవరకు సమంజసమో....
అదే తీరుగా...
భూమాత శరీర అంతర్భాగాన ఉన్న గనులు,,, వివిధ అవయవాలాంటివి.. మితిమీరి లాభాపేక్షతో.. తవ్వి తీయ్యడం....భూమాత ఆరోగ్యానికి హానికరమని గమనించాలి..భూమిలో ఉండే ప్రతీ ఖనిజం, లవణాలు, అన్ని బయటకు తీసి కృత్రిమ అవసరాలకు ధుర్వినియోగిస్తే... భూమాత శరీర తత్వం కోల్పోతుంది .
రోజూ బంగారు గుడ్డు పెట్టె బాతును కోసిన..కథను.. గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.... మనిషి అత్యాశ..
ప్రకృతి వినాశనానికి నాంది..

Posted Date:19-03-2014
comments powered by Disqus