Latest News

Telangana Poems


నేను హిందు వు ని----- వాడు ముస్లిం-----మనమంతా భారతీయులం -- బుచ్చి రెడ్డి

 

****** నేను హిందు వు ని----- వాడు ముస్లిం-----మనమంతా భారతీయులం ********

అరె   తు రు కొ డా ఆని నేను
అరె రెడ్డీ  డా అని వాడు
రోజు కు ఎన్నో సార్లు
తిట్టుకునే వాళ్ళం

ఒకే క్లాస్
పక్క పక్క కూర్చునే మిత్రుడు వాడు
నిమ్మ పిప్పెర్మెంట్ కోరి కి వాడు
గారే కొరికి  నేను
ఇలా తి న డా ని కి పంచుకునే వాళ్ళం
మా  మధ్య ఎంగిలి అనే మాట లే ధు

అశోకుడు గొప్ప రాజు అని నేను
అక్బర్ గొప్ప రాజు అని వాడు
వానికి  ఎన్ . టి  .ర్  ఇష్టం
నాకు ఏ . ఎన్ .ర్ ఇష్టం
ఇద్దరి మధ్య  సినిమాల గురించి వాధన లు
 నీవు లంగా గాని వ ని నేను
నీవు లఫంగ్ అని వాడు
ఎన్ని తిట్టుకున్నా--
మా ఇద్దరి స్నేహం చూచే
వాళ్ళ కు ఈర్ష గా తొచే ధీ??

నాతో పాటు రామాలయానికి వచ్చే వాడు
దేవు ని కోసం కాధ ని-- ఇద్దరికి తెలుసు
అయ్యాగారు పలహారం పెట్టె గానే జంప్ అయ్యే వాళ్ళం
వా ని ఇంట్లో గోడల కు
శ్రీ రాముని బొమ్మ-- లక్ష్మి దేవి బొమ్మలు ఉండేవి
అపుడపుడు
వానితో పాటు మజిద్ కు వెళ్ళేవాణ్ణి
వాడు వచ్చే వరకు బయట ఏధిరి చూస్తూ
మాకు
మజిద్ అయినా-- మంధిర ము అయినా
ఒకేలా అగుపించే ధీ---అలా బావించేవాళ్ళం
దసరా రోజు
నాతో పాటు జ మ్మి పూజాకు
దీపావళి కి--నా తో పాటు మాతాబులు కాలుస్తూ
పీరీల పండుగ కు -- వానితో
నేను కూడా అసయ ధూల అంటూ గంతులు వేస్తూ

మా భంధువుల ను
నేను ఏ వరస తో పలుకా రిస్తానో
వాడు కూడా అధె పిలుపు తో
అమ్మ గారు
అక్కయ్య గారు--
పక్క కు గారు తగిలిస్తూ
మాలో ఒకడి లా----
ఎన్నడు-- ఎప్పుడు
మా మధ్య 
వాడు ముస్లిం  అని నేను
నేను హింధూ అని వాడు తలవడం 
కానీ జ ర గ లే ధు

ఆ రోజుల్లో 
మాకు కులం అంటే ఏమిటో తెలియ ధు
మా మధ్య మిగిలింధీ
ప్రేమలు
ఆప్యాయతలు
మమతలు
నమ్మకాలూ

శని -- అధి వారాల్లో
క్లాస్ లోని టేబల్స్  ప రు చు కొని
చినిగిన నెట్టు కట్టు కొని
 టె బుల్ టెన్నిస్ ఆ  డే వాళ్ళం
పోటీ ఉన్నా
నా గెలుపు వానికి ఆనంధం
వాణి గెలుపు నాకు ఆనంధం
ఇలా సాగే ధీ మా స్కూల్ జీవితం

ఏండ్లూ  గడిచాయి
మా మధ్య దూరం పెరిగి పోయింధీ

రాజకీయ నేత లు
వాళ్ళ అవసరాన్ని బట్టి
కులాలను రెచ్ఛ గొట్టుతూ
దేశం లో -- ముస్లిం లు అంటే
ప రాయి వాళ్ళు-- దేశ  ధ్రో హు లు గా  చిత్రీకరిస్తూ---
నెహ్రూ గారి రాజా రికం కోసం
దేశం-- హింధూ-- ముస్లిం దేశాలు గా
వి డి పోయి
ఇప్పటికీ--ఇంకా
ఆ వాసనలు
వ్యతిరేఖ భావన లు
వి జాతీయులు గా
అనుమానితులు గా
విధ్వాం స కు లు గా  త లు స్తూ
అవమానా లూ
మా న భంగాలూ
హత్యలూ
అణిచీవేతలూ
అనుమానాలూ
అరాచకాలూ
తగుల బెట్టడాలూ
కూల్చి వెతలూఒ-- జరుపుతూ--???
సుజలాం-- సుపలాం-- మలయజా సీత లాం-- స స్య శ్యామాలాం ??

వే ధా లు-- శాస్త్రాలు
 బ్రా హ్మణ వాధాన్ని   చన్కన వేసుకుని
స్వాములు-- జియ్యం గార్లు
హింధూ మతం గొప్ప దంటూ
వక్రీకరించిన భోధన ల తో
పిచ్చి నమ్మకాల తో
 ఇతర మతాల ను  దూరం కొడుతూ
 ఇమడా లేని తనం
సర్దుక పోలిని తనం--తో
ఉన్న నిజాల ను కప్పి పుచ్చుకుంటూ---

అన్ని రంగుల పార్టీ నేతలు
దేశ చరిత్ర ను  ఉన్నదున్నట్లు గా
ఏనాడూ చెప్ప లే ధు
వాళ్ళు వక్రీకరించిన చరిత్ర చ ధీ వి
మన మన అభిప్రాయాల తో-- నమ్మకాల తో--  ధా ప రీ కాల తో---??

సర్వ సత్తాక సామ్య వాధ  ---ప్ర జ సామ్య  దేశం లో
ఎంధుకు ఈ వేరు చూపులు-- దేనికి

అమెరికా పెత్తనం -- జోక్యం తోనే
ఈ చరిత్ర లో యుద్దాలన్ని-
ముస్లిమ్స్ అంటే టెర్రరిస్ట్ లు అని 
సాగిస్తున్న
విష ప్రచారా ని కి జన  గ న మన పాడాలి

మతం ఒక మత్తు మంధు
ఫుల్  స్టాప్ ఉం డ ధు
ఆ మత్తు  తో
శ్లేషం లో పడిన  ఈ గ లా గా
కొట్టు కోవడం తప్ప
మనసున్న మనిషిలా
గుర్తించాలి-- అర్థం చేసుకోవాలి

వాళ్ళు పుట్టింధీ
గాంధీ జి పుట్టిన దేశం లో నే
జెండా ఒకటి అయినపు డు
అజెండా లో తేడా లెంధుకు ??
ముస్లిమ్స్ 
పోరాట  యోధు లై నా
ఆట గాండ్లు అయినా
సినీ నటులు అయినా--
మన మాట ల్లో
మన చూపుల్లో
మన ఆలోచన ల్లో-- వంక రీ తనం
ఒపీనియన్స్ లో తేడాలు దేనికి -- ఎంధుకు ??
ఎంధుకు ఈ బేధాలు
ఎక్కడ ఉంధీ ఈ  లోపం

బాబ్రి మజిద్ కూలిచి వెత
గుజరాత్ లో ని హింస
 ఎంతకాలం ఈ తీరు--- మారే ధీ ఎప్పుడు

మన ఆలోచనల్లో
మన ఆచరణ ల్లో
మన నడక లో
మార్పు రావాలి
మనమంతా భారతీయులం
అన్న భావ న మన లో కలుగాలి-- రావాలి
 ముస్లిమ్స్--  వాళ్ళ కోసం
వాళ్ళ నీడ కోసం
వాళ్ళ సమా నత్వం కోసం
సమాన హక్కుల కోసం
మనం చేతులు క లు పా లీ
మార్పు తేవాలి-- మార్పు రావాలి
అల్ల్‌హో అక్బర్----
హింధూ-- ముస్లిం --   భాహి-- భాహి
-----------------------------------------------
బుచ్చి రెడ్డి
--------------------------------------
 నోట్---నాకు తోచిన మాటలు-- నచ్చాక పోతే సారీ

టే ఎక్కువ తడ్తలేదు 

Posted Date:19-03-2014
comments powered by Disqus