Minister Srinivas Goud | రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నది. రాహూల్ గాంధీ(Rahul Gandhi) పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా మీ పార్టీ అధికారంలోకి రాదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు. బుధవారం మహబూబ్నగర్లో మీడియా సమావేశంలో కాగ్రెస్ విధానాలపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ..బీఆర్ఎస్ది కుటుంబ పరిపాలన అంటారు. అలా అయితే మీకున్న అర్హత ఏంటని సూటిగా ప్రశ్నించారు.