ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలను అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు వాహన తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తవ్వనుంది. అంపేర్, ఒకినోవా సంస్థలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆయా కంపెనీలకు రూ.500 నుంచి రూ.1000 కోట్ల ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పర్యావరణాన్ని కొంత మేరకైనా పరిరక్షించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

మునుపటి వ్యాసం