జగన్ నిర్ణయానికి తెలంగాణ ఉద్యోగుల ఆనందం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. తెలంగాణ స్థానికతతో ఏపీలో పనిచేస్తున్న 711 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు క్లాస్-3, క్లాస్-4 స్థాయిలోని ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్టు ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం సాగుతున్న ఈ వివాదం ఎట్టకేలకు నేడు తెరపడినట్లైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయిన ఉద్యోగ సంఘాలకు ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగానే ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపారు. దీంతో ఉద్యోగులను తెలంగాణకు పంపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మునుపటి వ్యాసం