ఇకపై పోస్టాఫీసుల్లో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్స్‌

స్టాంప్‌ కాగితాల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతి: స్టాంప్‌ కాగితాల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై  రాష్ట్రంలో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్స్‌ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. గత కొంత కాలంగా ఈ పేపర్లను కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సులభంగా స్టాంప్‌ పేపర్స్‌ పొందేందుకు పోస్టాఫీసులే సరైన మార్గమని రిజిస్ట్రేషన్ల శాఖ భావించి తదానుగుణంగా చర్యలు చేపట్టింది. దీనిపై ఇప్పటికే పోస్టల్‌ శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.10, రూ.20, రూ.50, రూ.100 డినామినేషన్ల స్టాంప్‌ పేపర్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,952 మంది లైసెన్సు పొందిన స్టాంప్‌ వెండార్స్‌ ప్రజలకు వీటిని అమ్ముతున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది. 

మునుపటి వ్యాసం