జానారెడ్డి నియోజకవర్గ ప్రజలను ఏనాడు పట్టించుకోలేదు: తలసాని

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు

నల్గొండ: నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భగత్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఘోర పరాజయం తప్పదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోని జానారెడ్డి, ఈ ఉపఎన్నికల్లో గెలిచి చేసేదేమీ లేదని తలసాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దవూర మండల పరిధిలోని తెప్పలమడుగు, లింగంపల్లి తదితర గ్రామాల్లో మంత్రి తలసాని, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, చెన్నూరు ఎంఎల్ఏ బాల్కా సుమన్ తదితరులు పాల్గొన్నారు. విద్యావంతుడైన భగత్ వల్లనే సాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 

మునుపటి వ్యాసం