సిరిసిల్లలో బాంబు కలకలం

ఛత్తీస్‌గ‌ఢ్ లో మావోయిస్టుల కాల్పుల అనంత‌రం రాష్ట్రంలో అప్రమత్తమైన పోలీసులు విస్తృత త‌నిఖీలు చేప‌డుతున్నారు.

సిరిసిల్ల: ఛత్తీస్‌గ‌ఢ్ లో మావోయిస్టుల కాల్పుల అనంత‌రం రాష్ట్రంలో అప్రమత్తమైన పోలీసులు విస్తృత త‌నిఖీలు చేప‌డుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ బాంబు బయటపడింది. దీంతో పోలీసులు టిఫిన్ బాక్స్ బాంబును వెలికితీసి నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయేమోనని పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల-నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిమడ్ల, మానాల అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులు, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతం కావటంతో అప్పట్లో నక్సలైట్లు ఈ టిఫిన్ బాక్స్ బాంబును పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మునుపటి వ్యాసం