తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

తెలంగాణలో రానున్న 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుండి 0.9 కిమీ వరకు ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మరత్వడా వరకు ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఈ రోజు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, వానపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

 

మునుపటి వ్యాసం