జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు స్టే విధించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు స్టే విధించింది. పరిషత్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నాలుగు వారాల కోడ్‌ అమలు చేయలేదని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

మునుపటి వ్యాసం