పోలీస్ వాహనం బొల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో పోలీసు వాహనం బొల్తా పడింది. ఈ ఘటనలో ఎస్‌ఐ రఘుకు తృటిలో ప్రమాదం తప్పింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో పోలీసు వాహనం బొల్తా పడింది. ఈ ఘటనలో ఎస్‌ఐ రఘుకు తృటిలో ప్రమాదం తప్పింది. తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వెళుతున్న పోలీస్ వాహనం...ఎదురుగా వచ్చిన ఐస్ క్రీం బండిని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐకు స్పల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు ఎస్‌ఐ ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడించారు. 

మునుపటి వ్యాసం