పంజాబ్ లో రాత్రి కర్ఫ్యూ

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

పంజాబ్: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు ఉండనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న కొవిడ్-19 సంబంధిత ఆంక్షలను ఏప్రిల్ 10 వరకు పొడిగించాలని పంజాబ్ సర్కార్ గతంలో ఆదేశించింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం, కరోనా కేసులు పెరుగుతున్న లూధియానా, పాటియాలాతో సహా మరి కొన్ని జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

మునుపటి వ్యాసం