కర్నూలులో దారుణం.. కలుషిత నీరు తాగి వందమంది అస్వస్థత

కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందగా, మరో వంద మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

కర్నూలు: కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందగా, మరో వంద మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పాణ్యం మండలం గోరుకల్లులో చోటుచేసుకుంది. మూడు రోజుల నుంచి కలుషిత నీరుతాగి గ్రామస్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కొందరైతే ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. గోరుకల్లును నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనకుమారి, డీఎంహెచ్‌వోతోపాటు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సందర్శించారు. నూతన పైపులైన్లు వేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మురుగునీరు తాగునీటిలో కలిసి కలుషితమైందని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గౌరు చరితారెడ్డి అన్నారు. 

 

మునుపటి వ్యాసం