సోదరిపై అత్యాచారం.. ఫిర్యాదుతో వ్యక్తి ఆత్మహత్య

వావివరసలు మరిచిన ఓ ప్రబుద్ధుడు సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కొత్తగూడెం: వావివరసలు మరిచిన ఓ ప్రబుద్ధుడు సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదుతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొత్తగూడెంలో యువతి సొంత అన్నతో పాటు రామవరం గ్రామానికి చెందిన పెద్దమ్మ కుమారుడు అజయ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన విషయాన్ని తల్లి, పెద్దమ్మకు పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు తెలియజేయడంతో చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా..భయాందోళనకు గురైన అజయ్ తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మునుపటి వ్యాసం