'రియల్ మీ డేస్' లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ భారత్ లో రియల్ మీ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది.

హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ భారత్ లో రియల్ మీ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఈ ఐదు రోజుల సేల్ లో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ ఎక్స్‌ 7 ప్రో,  రియల్ మీ నార్జో 30 ప్రోతో పాటు మరిన్ని రియల్ మీ స్మార్ట్ ఫోన్లు అమ్మకానికి పెట్టింది.

రియల్ మీ ఎక్స్‌ 7 ప్రో ధర రూ.29,999 కాగా ఈ ఫోన్ పై రూ.2000 తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ రాయితీ క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే లభించదు. అదేవిధంగా, రియల్ మీ ఎక్స్‌ 7, నార్జో 30 ప్రో మొబైల్స్ పై రూ.1000 ఫ్లాట్ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై మాత్రమే వర్తిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ పే చేయవచ్చు. ఈ సేల్ లో రాయితీలు అనేది స్మార్ట్ టీవీలు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు,  స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్లు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, బ్రీఫ్‌కేసులు మొదలైనవి వాటిపై ఉన్నాయి.

మునుపటి వ్యాసం