జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు అనుమతి

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టు డివిజన్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ హై కోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుని డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.

అమరావతి: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టు డివిజన్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ హై కోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుని డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. పరిషత్ ఎన్నికల స్టే పై ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరం వాదనలు వినిపించారు. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ సీవీ మోహన్‌ రెడ్డి పిటిషన్‌ వేసిన వర్ల రామయ్యకు ఎన్నికలతో సంబంధం లేదని తెలిపారు. 28 రోజుల కోడ్‌ నిబంధన ఎన్నికలకు వర్తింపజేయనవసరం లేదని సీవీ మోహన్‌ రెడ్డి హై కోర్టు డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. ఇరు పక్షాల వాదలను విన్న బెంచ్‌ పరిషత్‌ ఎన్నికలకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో రేపే పరిషత్‌ ఎన్నికలు జరగనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కౌంటింగ్‌ నిలిపివేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

మునుపటి వ్యాసం