కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు

కన్న కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు జరిపిన ఘటన హుస్నాబాద్‌ పట్టణంలో జరిగింది

హుస్నాబాద్‌: కన్న కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు జరిపిన ఘటన హుస్నాబాద్‌ పట్టణంలో జరిగింది. 12వ వార్డుకు చెందిన మాసున శ్రీనివాస్‌ (38) పాము కాటుకు గురై మృతి చెందగా, కూతురే తండ్రి చితికి నిప్పు పెట్టింది. శ్రీనివాస్‌ జీవనోపాధి కోసం హన్మకొండలో ఓ మడిగను అద్దెకు తీసుకొని కంకబొంగులతో గంపలు, తడకలు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అద్దెకు  ఉంటున్న మడిగలో సోమవారం రాత్రి శ్రీనివాస్‌ పాము కాటుకు గురై మృతి చెందాడు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య స్వరూప, కుమార్తెలు అనూష్క, అక్షయలు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అనుష్క తండ్రి అంత్యక్రియలు చేసి చితికి నిప్పు పెట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.