అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో టైర్ల గోదాం పక్కన ఉన్న గుడిసెవాసులు రాగి వైరును కాల్చుతుండగా ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌: అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో టైర్ల గోదాం పక్కన ఉన్న గుడిసెవాసులు రాగి వైరును కాల్చుతుండగా ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా నిలువ ఉన్న టైర్ల గోదాంలో అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అఫ్జల్‌గంజ్ పోలీస్ సిబ్బంది, స్థానికులు అక్కడ ఉన్న టైర్లను మరో చోటుకి తరలించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అర్పే ప్రయత్నాలు చేశారు. మంటలో అదుపులోకి రానట్లైతే గోదాంకు సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 

మునుపటి వ్యాసం