జియో చేతికి ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్

టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తాజాగా కొన్ని సర్కిళ్లలో కొంత భాగాన్ని ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

న్యూదిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తాజాగా కొన్ని సర్కిళ్లలో కొంత భాగాన్ని ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు '800 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 3.75 మెగా హెర్ట్జ్, దిల్లీలో 1.25 మెగా హెర్ట్జ్, ముంబయిలో 2.50 మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రంను వినియోగించుకునే హక్కులను రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు బదలాయించేందుకు ఒప్పందం కుదిరింది' అని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్‌కు జియో సుమారు రూ.1,038 కోట్లు చెల్లించనుంది. అలాగే సదరు స్పెక్ట్రంనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.459 కోట్లు కూడా చెల్లిస్తుంది. 

 

మునుపటి వ్యాసం