పెంబర్తిలో బయటపడిన లంకె బిందె

రాష్ట్రంలోని జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో గురువారం ఓ వ్యక్తికి లంకె బిందె దొరికింది.

బిందెలో 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యం 
జనగామ: రాష్ట్రంలోని జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో గురువారం ఓ వ్యక్తికి లంకె బిందె దొరికింది. ఈ లంకెబిందెలో 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంబర్తి గ్రామంలో నర్సింహా అనే వ్యక్తి నెలరోజుల క్రితం 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దీనిని చదును చేసి వెంచర్ వేసే క్రమంలో ఆయనకు ఈ బిందె దొరికింది. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా తన కలలో అమ్మవారు వస్తున్నారని అమ్మవారి గుడి నిర్మిస్తానని తెలిపాడు. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తహసీల్దార్ రవీందర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు సందర్శించారు. 

మునుపటి వ్యాసం