కరోనా సమయంలో వేడి నీళ్లు, విటమిన్ సీ అవసరం

కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు వైద్య నిపుణులు సైతం పలు సూచనలు చేస్తున్నారు. వైరస్ ప్రభావాన్ని అరికట్టి, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ సూచనలు పాటించాలని వారు సూచిస్తున్నారు. వేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి నీళ్లలో పసువు కలుపుకుని తాగడం, వేడి వేడి టీ, కాఫీలు సేవించాలని అంటున్నారు. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు విటమిన్ సీ, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి చల్లటి వస్తువులు తీసుకోవద్దని సూచించారు. సబ్బుతో 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ముఖాన్ని చేతులతో తాకవద్దని, ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటి భాగాలకు తాకరాదని, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ ముఖానికి మో చేతులు అడ్డం పెట్టుకోవాలని వెల్లడించారు. ఈ సూచనలన్నీ విధిగా పాటిస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుందన్నారు. 

మునుపటి వ్యాసం