కొవిడ్ ఎఫెక్ట్: బేగం బజార్ ఇక సాయంత్రం వరకే..

హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బేగంబజార్ వ్యాపారుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బేగంబజార్ వ్యాపారుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచుతామని వ్యాపారులు ప్రకటించారు. వ్యాపారులు, వినియోగదారులు బేగంబజార్ మార్కెట్ కు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని వారు సూచించారు. కరోనా కారణంగా గతేడాది బేగంబజార్ లో స్వచ్ఛంద లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని వ్యాపారులు కోరారు.

 

మునుపటి వ్యాసం