ప్రేమ జీవితాన్ని పంచుకోవ‌డానికి ఆస‌క్తిగా ఉన్న: రాయ్ లక్ష్మీ

చిరంజీవి కథానాయకుడిగా ఖైదీ 150 చిత్రంలో రత్తాలు.. రత్తాలు.. అనే పాటతో అలరించిన రాయ్ లక్ష్మీ తను పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్: చిరంజీవి కథానాయకుడిగా ఖైదీ 150 చిత్రంలో రత్తాలు.. రత్తాలు.. అనే పాటతో అలరించిన రాయ్ లక్ష్మీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ లోని పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప‌వన్ క‌ళ్యాణ్ చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లోనూ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా రాయ్ ల‌క్ష్మీ ఈ నెల 27న నిశ్చితార్థం చేసుకోబోతున్న‌ట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొంది. నా జీవిత భాగ‌స్వామికి సంబంధించిన విష‌యాల‌ను ఇప్పుడే బ‌య‌ట పెట్టాల‌నుకోవ‌డం లేదు. గ‌త వార‌మే స‌న్నిహితుల‌కు ఆహ్వానించానని ఆమె తెలిపింది. నా ప్రేమ జీవితాన్ని పంచుకోవ‌డానికి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని రాయ్ ల‌క్ష్మీ పేర్కొంది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ తమిళ, తెలుగు, కన్నాడ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.