వకీల్ సాబ్ కు 3 రోజుల వరకు నో ఛాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోని అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోని అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన కథానాయకుడిగా ఏప్రిల్ 9న వస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి మూడు రోజుల వరకు టికెట్లు లభించకపోవటం విశేషం. ఒక్కటంటే ఒక్కటికెట్ కూడా లేకుండా అభిమానులు బుక్ చేసుకున్నారు. పవర్ స్టార్ కి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడంతో అన్నీ థియేటర్లలోనూ వకీల్ సాబ్ సందడే కనిపిస్తోంది. మహేష్ బాబు ఏఎంబీ థియేటర్లో అయితే 27 షోలన్నీ ముందే బుక్కయ్యాయి. దీంతో తొలి రోజే కాదు కనీసం వీకెండ్ లోనైనా వకీల్ సాబ్ సినిమా చూద్దామనుకున్న సినీ ప్రేక్షకులకు నిరాశే మిగలనుంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా... నివేదాథామస్, అంజలి, అనన్యలు కీలకపాత్రలో నటిస్తున్నారు.