ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు చేయాలి.. వాంఖ‌డే నివాసితుల లేఖ‌

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మ్యాచ్‌లు వాంఖడేలో జరపవద్దని స్థానికులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ ఠారక్రేకు లేఖ రాశారు.

ముంబయి: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మ్యాచ్‌లు వాంఖడేలో జరపవద్దని స్థానికులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ ఠారక్రేకు లేఖ రాశారు. ముంబయిలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతుండ‌టంతో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రికి లేఖ సమర్పించినట్లు పలు మీడియా సంస్థలు వెల్ల‌డించాయి. ఈ మ్యాచుల సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారని, దాంతో  కరోనా వైరస్ మరింత పెరుగుతుందని వారు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివాస ప్రాంతం కానీ ప్రదేశంలో మ్యాచ్‌ల‌ నిర్వహించాలని మ‌రైన్ డ్రైవ్ రెసిడెంట్స్ అసోసియేష‌న్ స‌భ్యుడొకరు పేర్కొన్నారు. శుభకార్యాలకు, మత సంబంధ‌మైన కార్య‌క్ర‌మాలకు, అంత్య‌క్రియ‌ల‌కు ఆంక్ష‌లు విధించిన ప్ర‌భుత్వం భారీ సంఖ్యంలో హాజరయ్యే ఐపీఎల్ మ్యాచ్‌కు ఎలా అనుమ‌తి ఇచ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేశంలో స‌గానికి పైగా కేసులు మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌వుతున్నా.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఐపీఎల్ మ్యాచ్‌ లకు అనుమ‌తి ఇవ్వ‌టంపై పలు విమర్శలకు తావిస్తోంది. 

మునుపటి వ్యాసం