రాష్ట్రంలో 11 స్టోర్లకు విస్తరించిన సోచ్‌

అత్యాధునిక, సాంప్రదాయ హంగులతో వస్త్ర ఉత్పత్తులను విక్రయించే సోచ్‌ ఇప్పుడు నిజామాబాద్ లో కూడా తమ విక్రయ కేంద్రాన్ని తెరిచింది.

నిజామాబాద్: అత్యాధునిక, సాంప్రదాయ హంగులతో వస్త్ర ఉత్పత్తులను విక్రయించే సోచ్‌ ఇప్పుడు నిజామాబాద్ లో కూడా తమ  విక్రయ కేంద్రాన్ని తెరిచింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 స్టోర్లకు విస్తరించినట్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా తమ బ్రాండ్ ఇమేజ్ ను బలోపేతం చేస్తున్నట్లు సోచ్‌ అప్పెరల్స్‌ సీఈఓ వినరు చట్లానీ పేర్కొన్నారు. నూతన స్టోర్‌లో విస్తృత శ్రేణి చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తాలు, టూనిక్స్‌, బ్రీజీ స్ట్రక్చర్స్‌, లైట్‌ వెయిట్‌ ఫ్యాబ్రిక్స్‌, కుర్తీ సూట్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌, ఫ్లూయిడ్‌ సిల్‌హ్యుటీస్‌ తదితర వస్త్రాలు ఫ్రెష్ కలెక్షన్‌లో లభిస్తాయన్నారు.

మునుపటి వ్యాసం