తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2055 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకున్నారు.

అప్రమత్తతే అవసరం అంటున్న వైద్యులు 
హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2055 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకున్నారు. వైరస్ బారిన పడి ఏడుగురు ప్రాణాలొదిలారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులతో కలిపి 3,18,704 కు చేరాయి. ఇందులో 1,741 మంది మరణించగా, 3.03 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,362 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇందులో 8,263 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం  87,332 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. స్వియ నియంత్రణ, మాస్క్ ధరించటం, సామాజిక దూరం, శానిటైజర్ వినియోగం కరోనా బారిన పడకుండా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు.