ఆరడుగల నేల లేక... ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలు

కరోనా మహమ్మారి అన్ని విధాలుగా అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

ముంబయి: కరోనా మహమ్మారి అన్ని విధాలుగా అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే మహమ్మారి కారణంగా శ్మశానంలో కూడా చోటు దొరకకుండా పోయింది. దీంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ ‌గాయ్‌ పట్టణంలోని శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించాలని అనుకున్నామని ఒక అధికారి తెలిపారు. అయితే స్థానికులు అభ్యంతరం తెలపడంతో అక్కడికి 2 కి.మీ దూరంలో ఉన్న మరో శ్మశాన వాటికకు తరలించామన్నారు. స్థలం సరిపోకపోవడంతో ఒకే చితిపై 8 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని అధికారి వెల్లడించారు.